Search This Blog

Friday, January 14, 2011

Brahma kaDigina pAdamu

బ్రహ్మ  కడిగిన  పాదము 


pa : బ్రహ్మ కడిగిన పాదము|

బ్రహ్మము తానెని పాదము||


ca : చెలగి వసుధ కొలిచిన నీ పాదము|
బలి తల మోపిన పాదము|
తలకగ గగనము తన్నిన పాదము|
బలరిపు గాచిన పాదము||



ca : కామిని పాపము కడిగిన పాదము |

పాము తలనిడిన పాదము|

ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము |

పామిడి తురగపు పాదము||



ca : పరమ యోగులకు పరి పరి విధముల|
పరమొసగెడి నీ పాదము|
తిరువేంకటగిరి తిరమని చూపిన|
పరమ పదము నీ పాదము||

No comments:

Post a Comment